TOP STORIESBreaking Newsfood

Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

Potato Kurma : స్టార్ హోటల్ టేస్టీ.. ఆలూ కుర్మా చేయడం వెరీ సింపుల్.. అన్నింటిలోకి అదిరిపోద్ది..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఆలూ కుర్మా అంటే ఇష్టపడని వారెవరు ఉండరు. టిఫిన్స్ లోకి అయినా.. భోజనంలోకైనా అదిరిపోయేలా స్టార్ హోటల్ టేస్టీలో మన ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సింపుల్. అది ఎలాగో చూద్దాం…

ఆలుగడ్డలు మనకు అవసరమైన అన్ని ముందుగా ఉడికించుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత కుర్మా తయారు చేయడానికి మసాలా పేస్టును కూడా తయారు చేసుకోవాలి.

అవసరమైనవి

ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఎండు కొబ్బరి,  లవంగా, యాలకులు, దాల్చిన చెక్క, ఎల్లి పాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధన్యాల పౌడర్, కొత్తిమీర.

మసాలా పేస్ట్ తయారు చేయడం :

మసాలా పేస్టు కోసం అవసరమైందని కొబ్బరి ముక్కలు, 3 లేదా 4 లవంగాలు, 2 యాలకులు, 10 ఎల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, దాల్చిన చెక్క ఒక ఇంచు, సరిపడా నీళ్లు పోసి గ్రాండ్ చేసుకోవాలి.

కుర్మా తయారీ :

స్టవ్ మీద పోపు పెట్టేందుకు కడాయిలో సరిపడా నూనె పోసుకుని దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి మూడు నిమిషాల పాటు ఉంచాలి.
మనం సిద్ధం చేసుకున్న మసాలా పేస్టును వేయాలి. మూడు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న రెండు మూడు టమాట ల ముక్కలను వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేయాలి.

ఆ తర్వాత తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలుగడ్డ ముక్కలను వేసి ముందు సరిపడా ఉప్పు, కారం, అవసరమనుకుంటే కొంచెం నీరు పోసి ఐదు నిమిషాల పాటు స్టవ్ మీదనే ఉంచాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి దించాలి.

ఇలా చేస్తే స్టార్ హోటల్ టేస్టీలో ఆలు కుర్మా సిద్ధమవుతోంది. దీనిని పూరీలోకి, చపాతీ, పరోటా, అన్నంలోకి తినవచ్చును.

MOST READ : 

  1. Heart Health: గుండె ఆరోగ్యానికి అద్భుతమైన 5 ఆహార పదార్థాలు..!

  2. Health: ఉదయం మీ దినచర్యలో ఇవి ఉంటే.. ఇక మీ ఆరోగ్యం మీ వెంటే..!

  3. Steet Food: రుచిగా ఉన్నాయని రోడ్డు పక్కన ఫుడ్ లాగిస్తున్నారా.. అయితే మీకు ఆ రోగాలు గ్యారంటీ..!

  4. Diabetes Patients: డయాబెటిస్ పేషెంట్లు అరటి పండు తింటే..?

మరిన్ని వార్తలు