Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Sub Collector : ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం సందర్శించిన సబ్ కలెక్టర్..! 

Sub Collector : ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం సందర్శించిన సబ్ కలెక్టర్..! 

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం సందర్శించారు. స్థానిక గిరిజన గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో, రిటర్నింగ్‌ అధికారులతో మాట్లాడారు.

మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో 266 పోలింగ్‌ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రిని రూట్‌ వారిగా సక్రమంగా పంపిణీ చేయాలని సబ్ కలెక్టర్‌ సూచించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అధికారులు చురుకుగా పనిచేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా అభ్యర్థులు ఓటర్లు సహకరించాలని చెప్పారు. ఏదైనా సందేహాలు ఉంటే స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్ సంప్రదించాలన్నారు.

MOST READ 

  1. District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. గ్రీన్ ఫీల్డ్ హైవే వేగవంతంగా పూర్తి చేయాలి..!

  2. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  3. TET : తెలంగాణ టెట్ షెడ్యూల్ రిలీజ్.. పరీక్ష తేదీలు ఇవే..!

  4. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

మరిన్ని వార్తలు