Narayanpet : మే 1 నుండి వేసవి క్రీడా శిబిరాలు.. దరఖాస్తు చేసుకోవాలి..!
Narayanpet : మే 1 నుండి వేసవి క్రీడా శిబిరాలు.. దరఖాస్తు చేసుకోవాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
మే 1 నుండి 31 వరకు నారాయణపేట మిని స్టేడియంలో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డివైఏస్ ఓ వెంకటేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో ఉచిత శిక్షణ ఇస్తూ జిల్లా యువతను క్రీడాకారులను జాతీయస్థాయిలో సీనియర్ క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా శిబిరాలలో వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సీనియర్ క్రీడాకారులైతే వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్ తో ఈనెల 22లోగా జిల్లా క్రీడా శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారి అర్హతను బట్టి కోచులుగా ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు, దాదాపు పది శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం సాయంత్రం వేళల్లో శిక్షణ ఇస్తారని, కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, కోకో, నెట్ బాల్ తదితర అంశాలలో కోచుల ప్రవేశ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
MOST READ :
-
BREAKING : హనీ కేక్ తిని ఐదుగురు చిన్నారులకు అస్వస్థత..!
-
Miryalaguda : మున్సిపల్ అధికారులు, సిబ్బందికి ఎమ్మెల్యే వార్నింగ్.. ఇక డే బై డే సమీక్ష..!
-
Athletics: అథ్లెటిక్స్ కిడ్స్ కప్ ఇండియా – సీజన్ 2 ప్రారంభం..!
-
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
-
Liquor : మద్యం ప్రియులకు భారీ షాక్..!









