Breaking Newsజాతీయంతెలంగాణరాజకీయం

Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

Supreme Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

మన సాక్షి, వెబ్ డిస్క్ :

తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మూడు నెలల్లోనే అనర్హత తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది. మూడు నెలలకు మించకుండా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచన చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలనే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గతంలో రిట్ పిటిషన్ కేటీఆర్ వేశారు. స్పెషల్ పిటిషన్ ను ఎమ్మెల్యేలు వివేకానంద రెడ్డి, కౌశిక్ రెడ్డి వేశారు.

ఈ మూడు పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘమైన విచారణ జరిపింది. అనంతరం తీర్పు రిజర్వు పెట్టిన సుప్రీంకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటు చట్టం తీసుకురావాలని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు వీరే :

దానం నాగేందర్ (ఖైరతాబాద్)
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల)
కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్​పూర్)
తెల్లం వెంకట్రావు (భద్రాచలం)
గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్​చెరు)
కాలె యాదయ్య (చేవేళ్ల)
ప్రకాశ్​ గౌడ్ (రాజేంద్రనగర్)
డాక్టర్ సంజయ్ (జగిత్యాల)
అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
పోచారం శ్రీనివాస్​రెడ్డి (బాన్సువాడ)

MOST READ : 

  1. MLA : ఆ ఎమ్మెల్యేకు ఎంతో ఓపిక.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి..!

  2. Holiday : రేపు స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు.. తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు..!

  3. TG News : తెలంగాణలో రేషన్ కార్డుల ఏరివేత షురూ.. వారి కార్డులు కట్..!

  4. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

మరిన్ని వార్తలు