Family Survey : ఎక్కడుంటే అక్కడే సర్వే.. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి..!
Family Survey : ఎక్కడుంటే అక్కడే సర్వే.. ఇవి సిద్ధంగా ఉంచుకోవాలి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైనప్పటికీ ఏన్యుమరేటర్లు ఇండ్లను గుర్తించి, బ్లాక్ ల వారీగా విభజించే కార్యక్రమం ఈనెల 8వ తేదీతో పూర్తయింది.
కాగా శనివారం 9వ తేదీ నుంచి ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలను సేకరించనున్నారు. ఇంత కాలం పాటు సందిగ్ధంలో ఉన్న విషయాన్ని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సొంత ఊర్లో సర్వే వివరాలు ఇవ్వాలా..? ప్రస్తుతం ఉన్నచోటనే వివరాలు ఇవ్వాలా.. అని దానిపై ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి అనేకమంది పట్టణ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన విషయం తెలిసిందే. కాగా పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు అక్కడే సర్వే ఇవ్వాలా..? గ్రామాలకు రావాలా.. అని సందిగ్ధంలో ఉండగా ప్రభుత్వం ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఎక్కడ ఉంటే అక్కడే సర్వే వివరాలు తెలియజేయవచ్చని చెప్పింది. ఆధార్ కార్డులో ఉన్న వివరాల ప్రకారమే సర్వే జరుగుతుందని తెలియజేసింది.
75 ప్రశ్నలు :
ఈ సర్వేలో భాగంగా 75 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నెంబర్లు తెలియజేయాల్సి ఉంది. దాంతో పాటు వారి సమస్త వివరాలను తెలియజేస్తే సర్వే కంప్యూటర్ సమగ్ర సర్వే లో కులం వివరాలు చెప్పకుండా ఉండేందుకు కూడా ప్రత్యేక కాలంను తీసుకొచ్చారు.
వ్యవసాయ భూములు ఉన్నట్లయితే దానికి సంబంధించి ధరణి పాస్ బుక్ నెంబర్ తో పాటు ఏ రకమైన భూమి, పంట భూమి, సాగుభూమి వివరాలు చెప్పాల్సి ఉంది.
సిద్ధంగా ఉంచుకోవాల్సినవి :
సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లకు వివరాలు తెలియజేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉంచుకోవలసిన పత్రాలు ఏంటంటే..? కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వ్యవసాయ భూమి ఉంటే పట్టాదార్ పాస్ పుస్తకం, సెల్ ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. దాంతో పాటు సర్వే మొత్తం పూర్తయ్యాక ఇంటి యజమాని చెప్పిన వివరాలన్నీ నిజమే అని ప్రకటిస్తున్నట్లుగా సంతకం కూడా చేయాల్సి ఉంటుంది.
విద్యార్హతలతో పాటు ఉద్యోగం ఉపాధి వ్యాపారం లాంటి వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఏమైనా రుణాలు పొందారా? కుటుంబంలో ఎవరికైనా రాజకీయ నేపథ్యం ఉందా..? అనే విషయాలు కూడా సర్వే చేస్తారు.
MOST READ :
-
Gold Price : బంగారం ప్రియులకు గోల్డెన్ డేస్.. తులం బంగారం ఎంతంటే..!
-
Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం నిర్వహించిన గురుకుల విద్యార్థులు..!
-
TG News : తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్టకు బోర్డు ఏర్పాటు.. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశం..!
-
Viral Video : బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్.. పేరెంట్స్ కు దొరికింది, ఎలానో చూస్తే నవ్వుకోవాల్సిందే.. (Video)









