Suryapet : బోరు పక్కనే మరో బోరు.. ఎండిపోయిన పంట పొలం, తాసిల్దార్ కు రైతు వినతి..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఓ రైతు తన వ్యవసాయ బోరు పక్కనే పక్కనే మరో రైతు బోరు వేయడంతో తన బోరు ఎండిపోయిందని నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు.

Suryapet : బోరు పక్కనే మరో బోరు.. ఎండిపోయిన పంట పొలం, తాసిల్దార్ కు రైతు వినతి..!
తుంగతుర్తి మన సాక్షి :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో ఓ రైతు తన వ్యవసాయ బోరు పక్కనే పక్కనే మరో రైతు బోరు వేయడంతో తన బోరు ఎండిపోయిందని నిరసనతో ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే. తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామ నివాసి రైతు తల్లడ చొక్కయ్య కుచెందిన భూమి వెంపటి గ్రామ శివారులో సర్వే నెంబరు 415, 289 తన వ్యవసాయ భూమి ఉంది.
పక్కనే ఉన్న మరొక రైతు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బోరు వేశారని.. అతను బోరువేయడంతో తన బోరు ఎండిపోయిందని.. స్థానిక తహసిల్దార్ కు, జిల్లా కలెక్టర్ గతంలో వినతి పత్రం అందజేశానని.. ఇంతవరకు జిల్లా కలెక్టర్ గాని, తాసిల్దారు గాని పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వారం వారం తాసిల్దార్ చుట్టూ తిరుగుతున్నానని, తన పంట పొలం ఎండిపోయే స్థితిలో ఉందని తనకు న్యాయం చేయాలని తెలియజేశారు. ఇప్పటికీ మూడు నెలలు కలెక్టర్ కు తాహసిల్దార్ కు అర్జీ పెట్టుకున్నారని రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కోరారు.
ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో దయానంద్ ను వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి తెచ్చారని బాధిత రైతు చొక్కయ్య తనకు వినతిపత్రం అందజేశారని తక్షణమే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి బోరువేసిన అతనిపై చర్యలు తీసుకుంటామని.. బోరును సీజ్ చేస్తామని తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 100 నుండి 150 మీటర్ల దూరంలో బోరుకు బోరుకు మధ్య దూరం పాటించాలని రైతులకు సూచించారు. లేనియెడల ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోర్ ను సీజ్ చేస్తామని తెలిపారు.










