Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

BREAKING : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య..!

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

BREAKING : నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పారాణి ఆరకముందే నవ వధువు ఆత్మహత్య..!

నిజామాబాద్, ( ఆలూరు) మన సాక్షి

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడకు చెందిన అఖిలకు, కల్లేడి గ్రామానికి చెందిన తలారి శ్రీకాంత్‌తో గత నెల మార్చి 5వ తేదీన పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.

పెళ్లయిన పది రోజుల తర్వాత అఖిల తన పుట్టింటికి వెళ్లి, తిరిగి శుక్రవారమే అత్తగారి ఇంటికి (కల్లేడి) చేరుకుంది. శనివారం ఉదయం భర్త శ్రీకాంత్ టిఫిన్ తీసుకుని పని నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి అఖిల ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది.

కుటుంబ సభ్యులు గమనించే లోపే అఖిల మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అన్ని విషయాలు సాఫీగా సాగుతున్న క్రమంలో అఖిల ఈ కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు