Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.. పోటా పోటీగా ధర్నాలు..!
Suryapet : సూర్యాపేటలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది..!పోటా పోటీగా ధర్నాలు
ధర్నాలతో వేడెక్కిన సూర్యాపేట..
పోటా పోటీగా ధర్నాలు అక్రమ కేసులుఎత్తివేయాలని ఒకరు..
మా భూములు మాకు ఇప్పించాలంటూ మరొకరు..
పోలీస్ లకు సవాలుగా మారిన ధర్నాలు..
మీడియా ప్రాంగణంగా మారిన జనగాం క్రాస్ రోడ్..
సూర్యాపేట రూరల్, మనసాక్షి :
డిసిఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఛైర్మెన్ వట్టే జానయ్య యాదవ్ భూ ఆక్రమణలను చేశాడంటూ జనగామ క్రాస్ రోడ్ లో బాధితుల ధర్నా చేయగా,మరోవైపు డీసీఎంఎస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఛైర్మెన్ వట్టే జానయ్య యాదవ్ పై అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని ఆయన సతీమణి, సూర్యాపేట మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ వట్టె రేణుక డిమాండ్ చేశారు.
బహుజన వాదం ఎత్తుకున్నందుకే మంత్రి జగదీశ్ రెడ్డి కక్షగట్టి తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
మంత్రి దగ్గర ఉన్నప్పుడు మంచివాడైన తన భర్త ఇప్పుడు ఎలా కబ్జాకోరు అయ్యాడో మంత్రి జగదీష్ రెడ్డి సమాధానం చెప్పాలని జానయ్య సతీమణి రేణుక డిమాండ్ చేశారు.ఒకటే రోజు దాదాపు 71 కేసులు పెట్టడం వెనుక మంత్రి జగదీష్ రెడ్డి ప్రోద్బలం ఉన్నదని,తన భర్తకు ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి బాధ్యత మంత్రి జగదీశ్ రెడ్డి దే అని ఆమె తేల్చిచెప్పారు.
మీడియాతో మాట్లాడిన అనంతరం ఆమె జానయ్య అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.పోలీస్ లు ముందస్తు గా రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద భారికెట్స్ ఏర్పాటు చేసి కట్టడి చేశారు.ర్యాలీగా వస్తున్న వారిని అరెస్ట్ చేస్తారని అనుకున్నా పోలీస్ లు వాటికి నచ్చ జెప్పి వెనకకు పంపించారు.
ALSO READ :










