BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?
BREAKING : ఆర్డిఓతో సహా మరో ఇద్దరు అధికారుల సస్పెండ్..?
మన సాక్షి , మదనపల్లి :
ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంది. ముగ్గురు అధికారులపై వేటు వేసింది. మదనపల్లి ప్రస్తుత ఆర్డిఓ హరిప్రసాద్, మాజీ ఆర్డిఓ మురళి తో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ని సస్పెన్షన్ చేసింది. ఈ కేస్ పై ప్రభుత్వం మరి కొంతమంది పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రాజకీయ నాయకుల హస్తం .?
మదనపల్లి తాసిల్దార్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం విషయంపై ప్రభుత్వం సీరియస్ గా విచారణ జరుగుతుంది. ఈ సంఘటనలో అధికారులతో పాటు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా భావిస్తుంది. ప్రతి చిన్న అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనలో ఎవరెవరున్నారని పరిశీలించి అందరిపై వేటు వేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి :
WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!
Srisailam : శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిన అధికారులు..!









