Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కొనసాగుతోంది. రైతులకు పంట పెట్టుబడి సహాయంగా ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయలను అందజేసే ఈ పథకం ప్రస్తుతం గందరగోళంలో ఉంది. కొంతమంది రైతులకే రైతు భరోసా ద్వారా పంట సహాయం అందడంతో మిగతా రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా వస్తుందో రాదో అని ఆందోళనలో ఉన్నారు. యాసంగి సీజన్ పూర్తయినప్పటికీ కూడా ఇంకా రైతు భరోసా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది.
ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సహాయం జమ అయ్యింది. ఒక విడతగా రైతులకు ఎకరానికి 6000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఈ సీజన్ లో అందజేస్తుంది. కాగా మొదటగా మార్చి నెలాఖరు వరకు రైతు భరోసా రైతులందరికీ అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం విధితమే. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు జమ చేశారు. ప్రభుత్వం కీలకమైన ప్రాజెక్టులన్నీ ఒకేసారి అమలు చేస్తుండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పెండింగ్ లో ఉన్న యాసంగి రైతు భరోసా డబ్బులను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు వారి వారి ఖాతాలలో జమ చేయగా మిగతావారు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ముఖ్యమంత్రి ప్రస్తుతం కీలక ఆదేశాలు జారీ చేయడం వల్ల మే రెండవ వారంలోగా ప్రతి రైతుకు రైతు భరోసా అందించే విధంగా అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. రైతు భరోసా పథకానికి నిధులు జమ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
వానాకాలంకు ముందస్తు కసరత్తు :
మే రెండవ వారం లోగా యాసంగి రైతు భరోసా నిధులను పూర్తిస్థాయిలో రైతుల ఖాతాలలో పంట పెట్టుబడి సహాయం జమ చేయాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా రాబోయే వానా కాలం సీజన్ కు ఈసారి ముందస్తుగానే రైతులకు రైతు భరోసా అందించేందుకు నిధుల సమీకరణలో అధికారులు సిద్ధమయ్యారు. రాబోయే వాన కాలం నుంచి ముందస్తుగా రైతులకు పంట పెట్టుబడి సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
MOST READ :
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : ఇంటింటికి ఇంటర్నెట్.. 28 వేల పోస్టులకు నోటిఫికేషన్..!
-
Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!









