Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ శుభవార్త తెలియజేసింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అందుకు గాను కొత్తగా గ్రామ పాలన అధికారి (జిపిఓ) పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది.

గ్రామ పాలన అధికారి పోస్టులను 10,945 జిపిఓ పోస్టులను నియమించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందుకుగాను ఈ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.. గతంలో పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టిన విధానంలోనే జిపిఓల నియామకాన్ని కూడా చేపట్టాలని వివచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా 10,954 జిపిఓ పోస్టులు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వీఆర్ఏ, వీఆర్వోలలో అర్హులైన వారిని గుర్తించి తీసుకోవాలని మొదట్లో భావించింది. ఈ మేరకు గ్రామ పాలన అధికారిగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారిని ద్వారా జిల్లా కలెక్టర్లు ఆప్షన్ తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7000 మందికి అర్హత ఉన్నట్లు తెలిసింది. వారికి ప్రవేశ పరీక్షలు నిర్వహించి జిపిఓలుగా నియమించాలని ప్రభుత్వం భావించింది.

ఇదిలా ఉండగా కొత్త పోస్టుల కారణంగా పాత సర్వీస్ కోల్పోతామని కొంతమంది కోర్టుకు వెళ్లారు. అయితే సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ తో పాటు సర్దుబాట్లపై ప్రభుత్వం కసరత్తు చేపడుతుంది. ఉన్నత స్థాయి అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాక జిపిఓల నియమాకంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

MOST READ NEWS :

  1. WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. సెట్టింగ్స్ చేసుకుంటే సరిపోతుంది..!

  2. Tea : రోడ్ సైడ్ టీ భలే టేస్ట్ గా ఉందా.. అయితే ఈ సీక్రెట్ తెలిస్తే మళ్లీ ఎప్పుడు తాగరు..!

  3. Gold Price : బంగారం కొనుగోలుకు మహిళల ఆసక్తి.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  4. Hyderabad : విల్లాలో తాగుబోతుల రచ్చ.. సెక్యూరిటీ గార్డును చితక్కొట్టారు..!

  5. Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

మరిన్ని వార్తలు