మన సాక్షి దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన తహశీల్దార్..!
ప్రభుత్వం,ప్రజలకు మధ్య వారధి పత్రికలనీ, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాటి పాత్ర కీలకమని సంస్థాన్ నారాయణపురం మండల తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మన సాక్షి దినపత్రిక నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన తహశీల్దార్..!
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:
ప్రభుత్వం, ప్రజలకు మధ్య వారధి పత్రికలనీ, ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరవేయడంలో వాటి పాత్ర కీలకమని సంస్థాన్ నారాయణపురం మండల తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం సంస్థాన్ నారాయణపురం మండల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మన సాక్షి తెలుగు దినపత్రిక 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా తాహాశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేటి సమాజంలో పత్రికల పాత్ర కీలకమైందని వీటికి స్వేచ్ఛ ముఖ్యమన్నారు. పత్రికల్లో పని చేసే జర్నలిస్టులకు, పత్రికలకు కూడా స్వేచ్ఛ ఉండాలని ఆయన అన్నారు. ఎవరికి భయపడకుండా నిర్భయంగా, నిస్సంకోచంగా వార్తలు రాసి నిజ నిజాలను నిగ్గు తేర్చాల్సిన అవసరం పాత్రికేయులపై ఉందన్నారు.
ప్రజల సమస్యలను వెలికి తీస్తూ ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో సమ సమాజ స్థాపనలో దినపత్రికల ప్రాధాన్యత ఎంతో ఉందని మన సాక్షి దినపత్రిక ప్రజల ఆధార అభిమానాలను పొందుతూ పత్రికల రంగంలో రాణించాలని తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం మండల మన సాక్షి దినపత్రిక విలేఖరి షేక్ కైసర్, జనగాం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మంచాల ఏసు, మంచాల రవీందర్, అంబేద్కర్ కమిటీ సభ్యులు మంచాల పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ
-
Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!
-
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
-
Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!
-
Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!









