Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఒక్కొక్కరు నేతలు, కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

Miryalaguda : కారెక్కుతున్న నేతలు.. మిర్యాలగూడలో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఒక్కొక్కరు నేతలు, కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు దైద సత్యం 500 మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరంతా టీఎస్ ఆగ్రోస్ మాజీ చీఫ్ తిప్పన విజయసింహారెడ్డి,నల్లమోతు సిద్ధార్ధ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 34 ,35 వార్డుల ఇంచార్జీలు కోల రామస్వామి, దైద వెంకటేష్, డీవీపీ సుబ్బా రావు అధ్వర్యంలో చేరిన వీరికి నల్లమోతు సిద్దార్థ కండువాలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

బీఆర్ఎస్ తోనే నియోజకవర్గ సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు కే దక్కుతుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని నల్లమోతు సిద్దార్థ సూచించారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చేయాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు.

బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి పట్టణ ప్రజల్లో అవగాహన కల్పించాలని నల్లమోతు సిద్దార్థ తెలిపారు. రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పరిపాలన అగమ్యగోచరంగా మారిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, పెద్ది శ్రీనివాస్ గౌడ్, లింగంపల్లి చీరంజీవి, మొండికత్తి లింగన్న, నల్లగంతుల నాగభూషణం, దోనేటి సైదులు, భాస్కర్ తో పాటు పార్టిలో చేరిన వారు షేక్ గౌస్, నందిపాటి నరేష్,దైద శ్రీకాంత్,దైద సంపత్, బొంగరాల నాగయ్య,దైద వెంకటేష్, దైద రవి కిషోర్,దైద శరత్ కుమార్, దైద విజయకుమారి, బలుగూరి తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

  1. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

  2. AP News : ముగ్గురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి..!

  3. Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి రైతు భరోసా కట్..!

  4. Mutton Boti : మటన్ బోటి కర్రీ తినడం మంచిదేనా.. వీరు తినకూడదు..!

మరిన్ని వార్తలు