TAJGVK : తాజ్ హోటల్స్, రిసార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు.. అత్యుత్తమ పనితీరు..!

TAJGVK : తాజ్ హోటల్స్, రిసార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు.. అత్యుత్తమ పనితీరు..!
హైదరాబాద్, మన సాక్షి:
ఆగస్టు 08, 2025 – TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన అత్యుత్తమ పనితీరును ప్రకటించింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం 15% పెరిగి రూ. 106.39 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ ఛైర్మన్ డా. జివికె రెడ్డి మాట్లాడుతూ, “నిరంతర డిమాండ్ మా మార్కెట్లలో బలమైన వృద్ధిని చూపుతోంది. త్రైమాసికంలో ఇతర ఆదాయంలో జాయింట్ వెంచర్ కంపెనీ గ్రీన్ వుడ్స్ ప్యాలెస్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 20.21 కోట్లు డివిడెండ్ ద్వారా వచ్చాయి” అని తెలిపారు.
గ్రీన్ వుడ్స్ ప్యాలెస్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైలోని తాజ్ శాంటాక్రూజ్ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ Q1 FY 2026లో రూ. 54.45 కోట్ల ఆదాయాన్ని, రూ. 20.62 కోట్ల EBITDAను సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్-UK ప్రకారం, TAJGVK నిర్వహణలో ఉన్న ఐదు తాజ్ హోటళ్లు ‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ 2025’ మరియు ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ హోటల్ బ్రాండ్ 2025’గా గుర్తింపు పొందాయి. రాబోయే త్రైమాసికాల్లో కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
MOST READ :
-
BIG BREAKING : తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
SBI : నిరుద్యోగులకు ఎస్బిఐ భారీ గుడ్ న్యూస్.. 5583 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలు ఇవే..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Gold Price : మరోసారి గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఒక్కరోజే రూ.2200..!









