జాతీయంBreaking News

TATA Copper : తాటి పాత్రల సంప్రదాయంతో టాటా కాపర్.. టీవీ, డిజిటల్ రంగంలోకి ప్రవేశం..!

TATA Copper : తాటి పాత్రల సంప్రదాయంతో టాటా కాపర్.. టీవీ, డిజిటల్ రంగంలోకి ప్రవేశం..!

ముంబయి:

భారతీయ సంస్కృతిలో తరతరాలుగా వస్తున్న రాగి పాత్రల్లో నీరు తాగే సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ టాటా కాపర్+ టీవీ, డిజిటల్ వేదికల్లోకి అడుగుపెట్టింది. వారసత్వం, ఆరోగ్యం, నేటి తరం వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని రూపొందించారు. టాటా కాపర్+ ఒక నాన్-కార్బోనేటేడ్ డ్రింక్. ఇది రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేయడం, తాగడం వంటి పురాతన భారతీయ సంప్రదాయాల నుండి ప్రేరణ పొందింది.

ఈ అలవాటును భారతీయ కుటుంబాల్లో తరతరాలుగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. టాటా కాపర్+ ఈ సంప్రదాయాన్ని నేటి ఆధునిక రూపంలో, సౌకర్యవంతంగా అందిస్తోంది. ఈ ప్రచార చిత్రం ఒక రైలులో జరుగుతుంది. ఇద్దరు ప్రయాణికులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు.

ఒక వృద్ధ ప్రయాణికుడు తన టిఫిన్ కోసం స్థలం చేసుకుని, పక్కన రాగి నీళ్ల సీసాను పెట్టుకుంటాడు. అదే సమయంలో, యువకుడు తన భోజనంతో పాటు టాటా కాపర్+ సీసాను పెట్టుకుంటాడు. వృద్ధుడు టాటా సీసా డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ ఒకే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామని తెలుసుకుని ఆనందిస్తారు.

ఈ సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రెసిడెంట్, హెడ్ – RTD బిజినెస్ పార్థ బిస్వాస్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉండే ఉత్పత్తులను రూపొందించడానికి మేము కృషి చేస్తున్నాం. టాటా కాపర్+తో, రాగి శాశ్వతమైన ఆరోగ్య ప్రయోజనాలను నేటి తరం జీవనశైలికి తగిన రూపంలో అందిస్తున్నాము. ఈ ప్రచారం తరాల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది” అన్నారు.

MOST READ : 

  1. FY Results : రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ అద్భుత పనితీరు.. లాభాల్లో 12.5% వృద్ధి..!

  2. Business : ముత్తూట్ ఫిన్‌కార్ప్ రికార్డు లాభాలు.. జైడస్ లైఫ్‌సైన్సెస్ ‘సులభ పరీక్ష’ ప్రచారం..!

  3. Liver Health: కాలేయ ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి..!

  4. Suryapet : సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరుగురికి జైలు శిక్ష..!

మరిన్ని వార్తలు