TOP STORIESBreaking Newsజాతీయంహైదరాబాద్
Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!
Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర వరుసగా రెండో రోజు కుప్పకూలింది. ఇంతకాలం పాటు భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం, గురువారం రెండు రోజులపాటు బంగారం ధరలు భారీగా తగ్గాయి.
బుధవారం 100 గ్రాముల బంగారం కు 2,700 తగ్గిన విషయం తెలిసిందే. కాగా రెండవ రోజు గురువారం కూడా 100 గ్రాములకు 4400 తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.
హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం 4000 రూపాయలు తగ్గి 801,000గా ఉంది. అదేవిధంగా 100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర 4400 తగ్గి 873,800 రూపాయలుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తో పాటు ప్రధాన పట్టణాల్లో గురువారం (10 గ్రాముల) తులం బంగారం 24 క్యారెట్స్ 87,380 రూపాయలు ఉండగా 22 క్యారెట్స్ (10 గ్రాముల) తులం బంగారంకు 80,100 రూపాయలు ఉంది.









