Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!

Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా పై కసరత్తు జరుగుతుంది. అందుకుగాను అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు 1020 మంది అభ్యర్థులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపిక చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డి పలు సూచనలు చేశారు.

 

ఆ సూచనలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. పార్టీలో ఇటీవల చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి ఒకరిద్దరికి తప్ప కొత్తగా చేరిన వాళ్ళకి టికెట్లు ఇవ్వద్దని ఆయన సూచించారు.

కోదండ రెడ్డి సూచనల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం..

 

ALSO READ :

  1. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  2. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!
  3. Lucky Draw : రూ. 100 కట్టు.. లక్ష కొట్టు.. అంటూ ప్రచారం..!
  4. TSRTC : ఆ రెండు రోజుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు టి ఎస్ ఆర్ టి సి శుభవార్త.. రూ. 5.5 0 లక్షల బహుమతులు..!
  5. BIG BREAKING : వేములపల్లి : అదుపుతప్పి ఆటో బోల్తా.. పలువురికి తీవ్ర గాయాలు..!

 

1. గత ఎన్నికల్లో మూడుసార్లు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వకూడదు

2. టికెట్ కేటాయింపు కోసం ఉదయపూర్ డిక్లరేషన్ ను ఫ్రేమ్ వర్క్ గా ఉపయోగించాలి.

3. తెలంగాణలో 2018 ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారికి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వకూడదు .

4. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఇతర పార్టీల అభ్యర్థులకు, పారాచూట్ లో వచ్చిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని రాహుల్ గాంధీ అనేక సమావేశాల్లో చెప్పారు.

5. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు యువతకు, యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

6. రైతుల పక్షాన పోరాడుతున్న కిసాన్ కాంగ్రెస్ కు కనీసం మూడు టికెట్లు ఇవ్వాలి.

7. పీసీసీ ఎన్నికల కమిటీ ముందు పెట్టిన జాబితా లోపాలతో నిండి ఉంది.

8. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని వ్యక్తులకు పూర్తిగా తిరస్కరించాలి.

9 . పి ఈ సి లో కనీసం 50% మంది అయినా టికెట్ ఆశించని వారు ఉండాలి. పిఇసి సభ్యులు ఆశవాహులుగా ఉంటే వారికి వారి మద్దతు ఇచ్చుకుంటారు. దానివల్ల ఎంపిక ప్రజాస్వామ్యంగా జరగదు.

ఈ సూచనలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోదండ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు