TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో డబ్బులు జమ..!

TG News : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్.. ఎకౌంట్లలో డబ్బులు జమ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలియజేసింది. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ పంపిణీ ప్రారంభించింది. రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులను జమ చేస్తుంది. సన్న ధాన్యం విక్రయించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ అందజేస్తుంది. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం 649.84 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ డబ్బులు 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనున్నది. ఇప్పటికే లక్షల మంది రైతుల ఖాతాలలో నగదు డబ్బులు జమ అయ్యాయి.

శుక్రవారం ఒక్కరోజే 2.50 లక్షల మంది రైతుల ఖాతాలలో బోనస్ డబ్బులు జమ అయ్యాయి. ఇదిలా ఉండగా నగదు జమ కాని రైతులు ఖాతాలలో సోమవారం నుంచి మిగిలిన మొత్తం డబ్బులు జమ కానున్నాయి. కొంతకాలంగా బోనస్ చెల్లింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం స్పందించి నిధులను విడుదల చేయడంలో రైతులు ఆనందంలో ఉన్నారు.

డబ్బులు ఖాతాలలో జమ కాని రైతులకు సోమవారం నుంచి నగదు జమ కానున్నాయి. అందుకు గాను రైతులు మీ ఖాతా ఆధార్ లింక్ అయిందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. లేదా డబ్బులు రాకుంటే పౌరసరఫరాల శాఖ వెబ్సైట్ లోని ఫార్మర్ కార్నర్ ద్వారా ఫిర్యాదు కూడా చేయవచ్చునని, అలా కాకుంటే మండల వ్యవసాయ అధికారి వద్దకాని, కొనుగోలు కేంద్రం ఇన్చార్జిని గాని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు.

MOST READ 

  1. Food : దోష, ఇడ్లీ, వడ.. టిఫిన్ ఏదైనా టమోటో చట్నీ.. ఇలా చేస్తే రెస్టారెంట్ టెస్ట్.. అదిరిపోయేలా..!

  2. Insurance : బీమా కోసం ఇద్దరు అన్నదమ్ముల ప్లాన్.. రూ.3 కోట్ల కోసం.. కన్నతండ్రిని..!

  3. ACB : రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్..!

  4. Mobile App : మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకోవాలి..!

  5. Aadhaar : ఆధార్ కార్డులో ఫోటో బాలేదా.. మార్చుకోవాలంటే వెరీ సింపుల్..!

మరిన్ని వార్తలు