తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలుహైదరాబాద్

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేద ప్రజలకు మరో భారీ శుభవార్త తెలియజేసింది. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇదిలా ఉండగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం భారీ శుభవార్త తెలియజేసింది. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు జి ప్లస్ 1 తరహాలో ఇంటిని నిర్మించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 30 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేసుకునే అవకాశం కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 200 చదరపు అడుగులు, మొదటి అంతస్తులో మరో 200 చదరపు అడుగుల ఇల్లు నిర్మించుకునేలా జీవో 69 జారీ చేసినట్లు వెల్లడించారు

రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో పేదలు ఇంటి స్థలం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అరకొర వసతులతో తాత్కాలిక ఏర్పాటు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో జి ప్లస్ 1 నిర్మాణాలకు అనుమతి ఇస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అందజేస్తున్న 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని దశలవారీగా అందజేయనున్నట్లు తెలిపారు.

నిర్మాణం ఇలా ఉండాలి..!

జి ప్లస్ 1 విధానంలో పట్టణ ప్రాంతంలోని లబ్ధిదారులకు 96 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 70 అడుగుల విస్తీర్ణంలో వేరువేరుగా రెండు గదులతో, కనీసం 35.5 చదరపు అడుగుల్లో వంటగదిని నిర్మించుకోవాలి. ప్రతి ఇంటికి ప్రత్యేకంగా టాయిలెట్, బాత్రూములు తప్పనిసరిగా ఉండాలి. ఇంటి నిర్మాణం ఆర్ సి సి స్లాబ్ తో పాటు స్ట్రక్చరల్ డిజైన్ లకు డీ ఈఈ అనుమతి తీసుకోవాల్సి ఉంది. వారికి నాలుగు దశల్లో ఐదు లక్షల రూపాయలను అందజేయనున్నారు.

చెల్లింపులు ఇలా..!

మొదటి అంతస్తు రూప్ లెవెల్ వరకు నిర్మాణం అయితే ఒక లక్ష రూపాయలు, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ వేసిన తర్వాత ఒక లక్ష రూపాయలు, ఫస్ట్ ఫ్లోర్లో కాలమ్స్, స్లాబ్ గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు లక్షల రూపాయలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలను అందజేయనున్నది.

MOST READ : 

  1. TG News : టోల్ ప్లాజా వద్ద అర్దరాత్రి కారు పల్టీ.. తనిఖీ చేయగా షాక్ తిన్న పోలీసులు..!

  2. Gold Price : బంగారం ధరలు ఎవరు నిర్ణయిస్తారో.. ఎలా నిర్ణయిస్తారో తెలుసా..!

  3. Kisan App : పత్తి అమ్ముకునేందుకు కిసాన్ కాపస్ యాప్ తప్పనిసరి.. రైతులకు అవగాహన కల్పించిన అధికారులు..!

  4. Nalgonda : నల్గొండలో సంచలనం.. మత్తు ట్యబ్లెట్స్ అమ్ముతున్న ఏడుగురు అరెస్ట్..!

మరిన్ని వార్తలు