Breaking Newsతెలంగాణహైదరాబాద్

TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!

TG News : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025.. భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం..!

మన సాక్షి:

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 మీర్ఖాన్‌పేటలోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది.

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభోపన్యాసం చేస్తూ, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను అధికారికంగా ప్రారంభించారు.

వేడుకకు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామికవేత్తలు, పలు రంగాల ప్రముఖులు ఉన్నారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ & పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ CEO శ్రీ ఎరిక్ స్వైడర్, నోబెల్ శాంతి గ్రహీత కైలా‌ష్ సత్యార్థి, టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్. దినేష్, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ శ్రీమతి శోభన కామినేని, అదానీ పోర్ట్స్ & SEZ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తదితరులు ప్రసంగించారు.

నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, సీనియర్ అధికారులు, వివిధ దేశాల ప్రతినిధులు, ప్రపంచ సంస్థల ప్రతినిధులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యారు.

MOST READ 

  1. Suryapet : 22 ఏళ్లు దేశ రక్షణలో విధులు.. గ్రామానికి సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో..!

  2. SBI : ఎస్బిఐలో పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఉద్యోగాలు.. గడువు లేదు త్వరపడండి..!

  3. Fire Accieent : గోవాలో భారీ ప్రమాదం.. 23 మంది మృతి..!

  4. Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు