travelBreaking Newsతెలంగాణహైదరాబాద్

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్‌ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త తెలియజేసింది. టిక్కెట్ల ధరలపై రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది.

ప్రస్తుతం విజయవాడ నుంచి గరుడ ప్లస్‌ బస్సు టికెట్‌ ధర రూ.635 ఉండగా దాన్ని రూ.444కు తగ్గించింది. గరుడ క్లాస్‌ రూ.592 ఉండగా రూ.438కి తగ్గించింది. ఇక రాజధానీ ఎసీ రూ.533 నుంచి రూ.448కి.. అలాగే లగ్జరీ సూపర్‌ క్లాస్‌ ధరలను రూ.815 నుంచి రూ.685కి తగ్గించేసింది.

అలాగే బెంగళూరు రూట్‌లలో చూసుకుంటే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర ప్రస్తుతం రూ.946 ఉండగా దాన్ని రూ.757కి తగ్గించింది. అలాగే లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర రూ.1203 నుంచి రూ.903కి, బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి తగ్గించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లు వర్తిస్తాయని ఆర్టీసీ స్పష్టం చేసింది.

హైదరాబాద్ – విజయవాడ రూట్ లో :

గరుడ ప్లస్ 30%, ఈ – గరుడ 36శాతం తగ్గింపు, సూపర్ లగ్జరీ లహరి నాన్ ఏసి 20% తగ్గింపు, రాజధాని లహరి ఏసి 16% తగ్గింపు.

MOST READ : 

  1. Nagarjunasagar : నేడు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తివేత.. ముగ్గురు మాత్రులచే ముహూర్తం..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. వాట్సాప్ లో ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం..!

  3. GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!

  4. Treatment : కప్పింగ్ తెరపి హిజామా.. నొప్పుల నివారణకు వినూత్న వైద్యం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

  5. TG News : తెలంగాణ రైతులకు ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆ రైతులకు ఎకరానికి రూ.4 వేలు బ్యాంకు ఖాతాలలో జమ..!

మరిన్ని వార్తలు