Terrible incident in Tamil Nadu : తమిళనాడులో ఘోర దుర్ఘటన
Terrible incident in Tamil Nadu : తమిళనాడులో ఘోర దుర్ఘటన
రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి
చెన్నై ,మన సాక్షి :
తమిళనాడు రాష్ట్రంలో ఘోరమైన దుర్ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం తమిళనాడులోని చెన్నై సమీపంలో తీవ్ర విషాదం నెలకొన్నది. అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించి ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
తమిళనాడులోని చెన్నైకి సమీపంలోని తిరువన్నమలై దగ్గర ఓ ఆర్టీసీ బస్సు సుమోను బలంగా ఢీకొట్టింది. సింగం బైపాస్ పై సుమోను బస్సు ఢీకొట్టగా సుమోలో ఉన్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ALSO READ : రాహుల్ గాంధీ తెలంగాణ బస్సు యాత్రపై కేటీఆర్ సంచలన కామెంట్స్..!









