TG News : గజ్వేల్ లో హై టెన్షన్.. కేసీఆర్ ఆఫీస్ పై దాడి, హరీష్ రావు ఫైర్..!
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో హైట్ టెన్షన్ వాతావరణ నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు.

TG News : గజ్వేల్ లో హై టెన్షన్.. కేసీఆర్ ఆఫీస్ పై దాడి, హరీష్ రావు ఫైర్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, కేసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో హైట్ టెన్షన్ వాతావరణ నెలకొన్నది. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంప్ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హల్ చల్ చేశారు.
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అంక్షా రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కసారిగా క్యాంప్ ఆఫీసులోకి దూసుకెళ్లి అక్కడ ముఖ్యమంత్రి ఫోటో పెట్టారు. అనంతరం కార్యాలయంలోనే జై కాంగ్రెస్ అంటూ నినాదాలు కూడా చేశారు.
ఈ సందర్భంగా దుండగులు క్యాంప్ ఆఫీసులో దాడి చేసి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడి దాడులు చేశారని బీఆర్ఎస్ ఆరోపించింది. కేవలం కార్యాలయంలో సీఎం ఫోటో మాత్రమే పెట్టామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల కారణంగా గజ్వేల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
ALSO READ : మంత్రి వివేక్ కు షాక్.. క్యాతనపల్లి మున్సిపల్ పీఠంపై బీఆర్ఎస్..!
హరీష్ రావు ఫైర్ :
గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడిని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి అని అన్నారు. ప్రజాస్వామ్యంపై ముఖ్యమంత్రి చేయించిన దాడిగా ఆయన అభివర్ణించారు. పట్టపగలే బీహార్ గ్యాంగ్ లాగా ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయం పైనే దాడులు చేస్తుంటే శాంతిభద్రతలు ఉన్నట్లా..? లేనట్లే..? అని ఆయన ప్రశ్నించారు.