తెలంగాణBreaking News

TG News : మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్లు ఖరారు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎన్నికల నగారా మొగడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించిన వార్డులు, చైర్ పర్సన్స్, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

TG News : మున్సిపల్ ఎన్నికల ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్లు ఖరారు, గెజిట్ నోటిఫికేషన్ విడుదల..!

మన సాక్షి తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఎన్నికల నగారా మొగడానికి సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ లకు సంబంధించిన వార్డులు, చైర్ పర్సన్స్, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి టికె శ్రీదేవి బుధవారం జీవో 14న జారీ చేసింది.

అందుకు సంబంధించిన వార్డులు, చైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ పై నివేదికలను సంబంధిత కార్యాలయాలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ రిజర్వేషన్లను ఖరారు చేసింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ నివేదిక సమర్పించింది.

ఈనెల 17వ తేదీన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వారం రోజుల గడువులో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్ లకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది.

బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేది ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ సమగ్ర నివేదికను సోమవారం ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డుల వారీగా చైర్పర్సన్ మేయర్ స్థానాలను బీసీలకు దక్కే వాటాను కమిషన్ స్పష్టం చేసింది.

అయితే మున్సిపాలిటీలలో జనరల్ 30, జనరల్ మహిళ 31, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళ 2, ఎస్సీ జనరల్ 9, ఎస్సి మహిళ ఎనిమిది, బీసీ జనరల్ 19, బిసి మహిళ 19, స్థానాలు కేటాయించారు. కార్పొరేషన్లలో జనరల్ ఒకటి, జనరల్ మహిళ నాలుగు, బీసీ జనరల్ రెండు, ఎస్సి ఒకటి, ఎస్టీ 1, బీసీ మహిళ ఒక స్థానాలను కేటాయిస్తున్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడ పట్టణానికి రూ.400 కోట్ల నిధులు తీసుకొచ్చాను.. ఎమ్మెల్యే బీ ఎల్ ఆర్..!

  2. అందమైన ఫోటోలతో ఆకర్షించి హానీ ట్రాప్.. నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, కిలాడీ భార్యాభర్తల అరెస్ట్..!

  3. PDS : రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రేషన్ బియ్యం పట్టివేత..! 

  4. BREAKING : లిఫ్ట్ కాలువలో ట్రాక్టర్ బోల్తా..!

  5. TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

మరిన్ని వార్తలు