Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking News

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించారు.

TG News : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుక..!

మనసాక్షి, హైదరాబాద్ :

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకను ప్రకటించారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు మరో DA ఇవ్వనున్నట్లు తెలియజేశారు. DA పెంపు ఫైల్ మీద సంతకం చేసి వచ్చా.. రేపో మాపో జీవో కూడా వస్తుందని తెలిపారు.

అదేవిధంగా పెన్షనర్లకు డిఏ, డిఆర్ పెంపు కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో వేలాదిమంది పెన్షనర్లకు లాభం చేకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న 30.03% డి ఆర్ ను 33.67 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2018 జూలై 1వ తేదీ నుంచి రిటైర్డ్ అయిన పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది.

2020 రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఇది లాభం కలిగించనున్నది. పెరిగిన డిఆర్ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నది. నాటి నుంచి 2025 డిసెంబర్ వరకు చెల్లించాల్సిన బకాయిలను నెలసరి వాయిదాలలో చెల్లించబడతాయి.

MOST READ NEWS 

  1. జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

  2. Suryapet : వ్యవసాయ విద్యార్థులకు గ్రామీణ కృషి అనుభవం కీలకం.. ధూపహాడ్‌లో అవగాహన కార్యక్రమం..!

  3. Suryapet : పువ్వులు అందించి.. జాగ్రత్తలు సూచించి..!

  4. SBI : ఎస్బిఐ కస్టమర్లకు రూ.2 లక్షలు ఇస్తుంది.. ఎందుకో తెలుసా..!

మరిన్ని వార్తలు