Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
ప్రశాంతంగా ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు..!
ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలను శుక్రవారం నిర్వహించడం జరిగింది.

ప్రశాంతంగా ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు..!
ఆమనగల్లు, మన సాక్షి:
ఆమనగల్లు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలను శుక్రవారం నిర్వహించడం జరిగింది. ఆమనగల్లు బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికలలో ఎన్నికల అధికారి అండేకార్ యాదిలాల్ ఆధ్వర్యంలో ఆమనగల్లు కోర్టు సూపరింటెండెంట్ మురళీధర్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి.
ఆమనగల్లు బార్ అసోసియేషన్ లో ఓటు హక్కు కలిగి ఉన్న న్యాయవాదులు ఈ ఎన్నికలలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకు న్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది లక్ష్మణ శర్మ న్యాయవాదులు ఉన్నారు.









