Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!

Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!

చింతపల్లి, మన సాక్షి :

అక్రమ సంబంధం పెట్టుకుని ఓ గిరిజన మహిళను అతి దారుణంగా హత్య చేసి గ్రామ సమీపంలోని బావిలో పడేసిన దృశ్యం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతురాలి భర్త బంధువులు తెలిపిన వివరాల ప్రకారం చింతపల్లి మండల పరిధిలోని పాలెం తండాకు చెందిన సభావత్ జ్యోతి( 30 ) అనే మహిళ అదే గ్రామానికి చెందిన సభావాత్ రాజు అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య తగువు జరిగి రాజు జ్యోతి పై దాడి చేయడంతో జ్యోతి మృతి చెందింది. రాజు భయానికి లోనై సభావాత్ జ్యోతి మృతదేహాన్ని ఊరి పక్క నే ఉన్న పాడుబడ్డ బావిలో పడేశాడు. జ్యోతి కోసం భర్త బంధువులు వెతకగా ఎక్కడ ఆచూకీ తెలియకపోవడంతో చింతపల్లి పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని జ్యోతి భర్త సభావాత్ శీను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో పూర్తిగా విచారణ చేయగా ఈ హత్యతో సభావత్ రాజుకు సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు.దీంతో రాజు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ అత్య విషయంలో పూర్తి విషయాలు తెలియాల్సిందని చింతపల్లి ఎస్ఐ ముత్యాల రామ్మూర్తి పేర్కొన్నారు.

సంఘటన స్థలానికి దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు, నాంపల్లి సిఐ రాజు, కొండమల్లేపల్లి సిఐ నవీన్ కుమార్,లు పరిశీలిస్తున్నారు. జ్యోతి మృతదేహాన్ని ఫైర్ ఇంజన్ సాయంతో బావి నీటిలో నుండి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

MOST READ : 

  1. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

  2. Ayyappa Devotees : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరి కి వెళ్తున్న వారికి వెసులుబాటు..!

  3. High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!

  4. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

మరిన్ని వార్తలు