Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ ఏడాది జనవరి మాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఏడాదికి ఎకరానికి 15 వేల రూపాయల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా అందజేస్తామని చెప్పినప్పటికీ, 12000 రూపాయలను అందజేయాలని నిర్ణయించారు.

వానాకాలం సీజన్ కు గాను పంటల సాగుకు ముందస్తుగానే ఎకరానికి 6000 చొప్పున రైతుల ఖాతాలలో నిధులు జమ చేశారు. కాగా యాసంగి సీజన్ ప్రారంభమైంది. రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వానాకాలం సీజన్ లో తుఫాన్ కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో రైతులకు భారీగా ఆర్థిక నష్టం కలిగింది. పంటలు చేతికి వచ్చే సమయంలో తుఫాన్ రావడం వల్ల కొంతమంది రైతులకు పెట్టుబడులు కూడా రాకుండా పోయాయి.

దాంతో యాసంగి సీజన్ లో సాగు చేయటం కష్టంగా మారింది. వానకాలం సీజన్ మాదిరిగానే యాసంగి కూడా ముందస్తుగా రైతు భరోసా అందిస్తే సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాలో కీలక మార్పులు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. యాసంగి సీజన్ లో రైతు భరోసా డబ్బులు వృధా కాకుండా సాగుచేసిన రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా పథకం శాటిలైట్ ఆధారంగా సాగు చేసిన రైతులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ ఆధారంగా పంటల వివరాలను సేకరించే పనిలో వ్యవసాయ అధికారులు ఉండాలని వారిని ఆదేశించారు.

దాంతో రైతు భరోసా పథకం శాటిలైట్ ఆధారంగా సాగుచేసిన వారికి అందించనున్నారు. యాసంగి రైతు భరోసా పథకం అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నప్పటికీ ఎప్పుడు ఇస్తామని విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. దాంతో ముందస్తు కాకుండా రైతులు సాగు చేసిన తర్వాతనే రైతు భరోసా అందించే అవకాశాలు ఉన్నాయి.

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్.. డ్రైవర్ బ్యాగులో రూ.4.30 లక్షలు..!

  2. Miryalaguda : బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి.. నిల్వ ఉన్న మద్యం సీజ్..!

  3. Rythu Bharosa : యాసంగి రైతు భరోసా ఆ రైతులకే.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Phone Calls : ట్రూ కాలర్ అవసరం లేదు.. మీకు వచ్చే కాల్స్ కు ఆధార్ లో ఉండే పేరు డిస్ ప్లే అవుతుంది..!

మరిన్ని వార్తలు