Kanagal : ఇసుక ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం..!
Kanagal : ఇసుక ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం..!
కనగల్, మన సాక్షి:
ఇసుక ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన సోమవారం కనగల్ మండల కేంద్రంలో జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం…. బోయినపల్లి గ్రామానికి చెందిన కడారి వెంకన్న (47) ఇసుక రీచ్ నుంచి ట్రాక్టర్ లో ఇసుక నింపుకొని నల్లగొండకు బయలుదేరాడు. మార్గమధ్యలోని మండల కేంద్రం సమీపంలో గల ఆన్లైన్ పికప్ పాయింట్ వద్ద సాండ్ టాక్సీ పిక్ అప్ చేయించుకుని ఇసుక ట్రాక్టర్ లోడ్ తో నల్లగొండకు వెళుతున్న క్రమంలో కొద్ది దూరం వెళ్లగానే వెనక ట్రాక్టర్ ట్రాలీ డోరు ఊడిపోయింది.
గమనించిన డ్రైవర్ వెంకన్న ఇంజన్ ఆఫ్ చేసి కిందికి దిగివచ్చి ట్రాక్టర్ ట్రాలీ వెనుక నుంచి మరికొందరి సాయంతో డోర్ ను నెట్టి సరి చేస్తుండగా దిగువలుగా ఉండడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. దీంతో గేర్లలో ఆఫ్ చేసి ఉన్న ట్రాక్టర్ ఇంజన్ స్టార్ట్ అయి ముందుకు కదిలి రోడ్డు కిందికి ఎడమవైపు కోపుగుంతలోకి ట్రాక్టర్ కదిలింది. ఇంజన్ ను ఆపేందుకు ట్రాక్టర్ ఇంజన్ పైకి ఎక్కుతున్న క్రమంలో కాలుజారి ట్రాక్టర్ ఇంజన్ మధ్య టైర్ కింద వెంకన్న పడిపోయాడు.
ఈ ప్రమాదంలో వెంకన్న తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని వద్ద డ్రైవర్ గా కొంతకాలంగా పనిచేస్తున్నారు. మృతునికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
MOST READ :
-
TG News : నిరుద్యోగ యువతకు అదిరిపోయే పథకం.. రూ.3 లక్షల సహాయం.. నేటి నుంచే..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
PhonePe Free Gas : ఫోన్ పే వాడేవారికి గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ సిలిండర్ ఇలా పొందండి..!
-
Miryalaguda : గ్రూప్ -2, గ్రూప్ -3 లో మహిళా టాపర్.. వినీషారెడ్డి..!









