Breaking Newsజాతీయం

Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!

Ration Cards : రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం భారీ షాక్.. వారి రేషన్ కార్డులన్నీ రద్దు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రేషన్ కార్డులు ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కోవిడ్ సమయం నుంచి ఇప్పటివరకు ఉచితంగా రేషన్ అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కోట్లాది రేషన్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రపంచంలో ఏ దేశం కూడా కోవిడ్ సమయంలో పేదలకు ఆహార ధాన్యాలు అందించలేకపోయింది. భారత దేశంలో మాత్రం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం అందజేసింది. అది ఇంకా ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వంపై భారం తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

వన్ నేషన్.. వన్ రేషన్ అనే నినాదాన్ని తీసుకువచ్చి దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన పేదలు ఎక్కడైనా ఆహార ధాన్యాలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టింది. దాంతో వలసలు వెళ్లిన వారికి తగు న్యాయం జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో రేషన్ కార్డు కాకుండా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. కొన్ని రాష్ట్రాలలో పేదల జనాభా కంటే కూడా రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. అందుకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు, ఈ కేవైసీ చేయించాలని నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డుతో ఈ కేవైసీ చేయించారు. కాగా చాలామంది ఈ కేవైసీ చేయించుకకని వారు ఉన్నారు. అలాంటి వారి రేషన్ కార్డుల పై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 5.8 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది.

దేశవ్యాప్తంగా 80. 6 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ప్రభుత్వం అందజేస్తుంది. ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజేషన్ చేశారు. కాగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను గుర్తించి వాటిని ప్రభుత్వం రద్దు చేసింది.

MOST READ : 

మరిన్ని వార్తలు