Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
Holidays : పాఠశాలలకు వేసవి సెలవులు.. ఆ.. ముందే విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి.
అందుకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 23వ తేదీన ప్రతి విద్యార్థికి ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీతో ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో 23వ తేదీన ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించింది.
ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఇంటర్మీడియట్ కళాశాలలకు మార్చి 31వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. వారికి జూన్ 2వ తేదీన కళాశాలలో పున ప్రారంభం కానున్నాయి. ఈ ఆదేశాలను ప్రభుత్వ, ప్రైవేటు అన్ని రకాల పాఠశాలలు పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి.. పారదర్శకంగా భూభారతి..!
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
-
Gold Loan : 30 నిమిషాల్లో గోల్డ్ లోన్.. రంగంలోకి ఆ సంస్థ..!
-
District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!









