Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!
Miryalaguda : మిర్యాలగూడలో యువకుడి హత్య.. ఆలస్యంగా వెలుగులోకి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అక్రమ సంబంధం అనుమానంతో ఓ యువకుడిని హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వచ్చింది. మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం..
మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామానికి చెందిన బనావత్ జాను (40) అదే గ్రామానికి చెందిన ఓ యువతీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అనుమానంతో ఆమె కుమారుడు సతీష్, కూతురు నాగమణి కలిసి బండరాయితో మోది హత్య చేశారు.
కాగా మృతుడి తమ్ముడు బాణావత్ కృష్ణ కు ఈ నెల 28వ తేదీన జాను చనిపోయి ఉన్నాడని ఇంట్లో వాసన వస్తుందని వారే ఫోన్ చేయడంతో వచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ తర్వాత అనుమానం వచ్చి నాగమణి, సతీష్ ల పై ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
LATEST UPDATE :
Runamafi : కుటుంబ నిర్ధారణ సరే.. వారికి రుణమాఫీ ఎప్పుడంటే..!
Panchayathi Elections : మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు.. బ్యాలెట్ తోనే నిర్వహణ..!
GURUKULA : గురుకుల పాఠశాలలో దారుణం, విద్యార్థులపై ఎలుకల దాడి.. విద్యార్థి సంఘాల ఆగ్రహం.!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!









