GURUKULA : గురుకుల పాఠశాలలో దారుణం, విద్యార్థులపై ఎలుకల దాడి.. విద్యార్థి సంఘాల ఆగ్రహం.!
GURUKULA : గురుకుల పాఠశాలలో దారుణం, విద్యార్థులపై ఎలుకల దాడి.. విద్యార్థి సంఘాల ఆగ్రహం.!
దేవరకొండ, మనసాక్షి :
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండ భీమనపల్లి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల ఆవరణలోని హాస్టల్లో సోమవారం రాత్రి నిద్రపోతున్న 13 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. సోమవారం రాత్రి ఘటన జరిగిన విషయం బయటకు పొక్కకుండా పాఠశాల నిర్వాహకులు గోప్యంగా ఉంచారు.
నిద్రపోతున్న తమను ఎలుకలు కరిచాయని విద్యార్థులు అధ్యాపకులకు చెప్పడంతో మంగళవారం ఉదయం పాఠశాల హెల్త్ సూపర్వైజర్ ఎలుకల దాడిలో గాయపడ్డ 13 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం తూర్పుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. విద్యార్థులను పరిశీలించిన వైద్య సిబ్బంది గాయాలకు చికిత్స చేసి విద్యార్థులకు ఏ ఆర్ వి వ్యాక్సిన్ లను ఇచ్చారు.
విషయం బయటకు పొక్కకుండా యాజమాన్యం విశ్వప్రయత్నం. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాగర్ వివరణ తమ పాఠశాలలోని విద్యార్థులకు ఎలుకలు కరిచిన మాట వాస్తవమేనని వారికి ఆసుపత్రిలో చికిత్స చేయించామని పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ చెప్పారు.
విద్యార్థి సంఘాల ఆగ్రహం :
కొండ భీమనపల్లి గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థుల మీద ఎలుకల దాడి పై మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో గురుకుల పాఠశాలలో ఎంతో ఆదర్శవంతంగా ఉండేవని, ఇప్పుడు వాటి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు.
విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా :
కొండ భీమనపల్లి పరిధిలో ఉన్నటువంటి బీసీ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులు ఎలుక కాటుకు గురికావడంతో విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలకు సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ సోమవారం జరిగిన సంఘటన గురువారం దాకా కప్పి గూర్చిన ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి బీసీ (బాలుర)గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు.
విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు అండగా ఉండి ఎలుక కాటికి గురైనటువంటి విద్యార్థులకు వైద్యం అందించాలని అన్నారు. లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో. నాయకులు పాల్గొన్నారు. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహమ్మద్ సౌభన్, బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యలమల గోపీచంద్. యుఎస్ఎఫ్ఐ, బిఆర్ ఎస్వి,ఏబీవీపీ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Elections : తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు అప్పుడే.. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి..!
Khammam : రైతు సంఘాల ధర్నాలో మంత్రి తుమ్మల.. రుణమాఫీ పై ఏమన్నారంటే..!
Praja Palana : తెలంగాణలో మళ్లీ ప్రజా పాలన.. 10 రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ..!









