TOP STORIESBreaking News

Neck: మెడ నల్లగా మారిందా.. ఇలా చేయండి ఈజీగా పోద్ది..!

Neck: మెడ నల్లగా మారిందా.. ఇలా చేయండి ఈజీగా పోద్ది..!

మన సాక్షి ఫీచర్స్ :

పరిశుభ్రంగా లేకపోవడం, హార్మోన్ల మార్పులు, చర్మ సమస్యలు, ఎండకు ఎక్కువగా తిరగడం లాంటి అనేక కారణాల వల్ల మెడ చుట్టూ నల్లగా మారవచ్చు. కొన్నిసార్లు గర్భధారణ లేదా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా మెడ నల్లబడుతుంది. ఈ సమస్యను తగ్గించడానికి ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలు చాలా సహాయపడతాయి. వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

1. నిమ్మరసం, తేనె

నిమ్మరసం చర్మంపై ఉన్న మలినాలను తొలగించడంలో, నలుపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి.

ఎలా వాడాలి: నిమ్మరసం, తేనె రెండింటినీ సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు రాసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

2. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్‌ను వాడి కూడా మెడపై నలుపును తగ్గించవచ్చు.

ఎలా వాడాలి: ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, అదే పరిమాణంలో నీటిని కలిపి బాగా కలపాలి. ఈ ద్రవాన్ని మెడ చుట్టూ రాయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేసుకోండి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.

3. పసుపు, పాలు

పసుపు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది, పాలలో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

ఎలా వాడాలి: కొద్దిగా గోరువెచ్చని పాలలో పసుపు కలిపి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్‌ను మెడకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

4. అలోవెరా జెల్

అలోవెరా జెల్ చర్మ సమస్యలను దూరం చేయడంలో చాలా సహాయపడుతుంది.

ఎలా వాడాలి: అలోవెరా జెల్‌లో కొద్దిగా కాఫీ పొడి, పసుపు కలిపి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ను మెడకు రాసి ఆరే వరకు ఉంచాలి. ఆ తర్వాత కొద్దిగా నీరు చల్లి సున్నితంగా స్క్రబ్ చేస్తూ శుభ్రం చేయాలి. ఇది మెడ నలుపును తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

5. ఓట్స్, పెరుగు

ఓట్స్ చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. పెరుగులో లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా వాడాలి: ఓట్స్‌లో కొద్దిగా పెరుగు కలిపి కాసేపు పక్కన పెట్టండి. అవి మెత్తబడిన తర్వాత కొద్దిగా స్మాష్ చేయండి. ఈ మిశ్రమాన్ని మెడపై నల్లగా ఉన్న ప్రాంతంలో రాయండి. కొద్దిసేపటి తర్వాత స్క్రబ్ చేస్తూ రుద్దాలి. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, నలుపును తగ్గిస్తుంది.

MOST READ : 

  1. Mother : విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించారు.. తల్లిని మాత్రం ఇంట్లో నుంచి గెంటివేశారు..!

  2. PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!

  3. Street Foods: స్ట్రీట్ ఫుడ్స్ తింటున్నారా.. కేంద్రం హెచ్చరిక..!

  4. Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!

  5. Eggs : గుడ్లు పాడైన విషయం తెలుసుకోండిలా.. నిల్వ చేయడం ఎలా..!

మరిన్ని వార్తలు