తెలంగాణBreaking Newsహైదరాబాద్

Gold Price : పసిడి ధర మళ్లీ పెరిగింది.. ఈరోజు తులం ఎంతంటే..?

Gold Price : పసిడి ధర మళ్లీ పెరిగింది.. ఈరోజు తులం ఎంతంటే..?

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధర మహిళలకు వణుకు పుట్టిస్తుంది. రోజురోజుకు ధరలు పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ రోజు కాస్త తగిన బంగారం ధర మరుసుటి రోజే మళ్లీ పెరిగింది. బుధవారం ఒక రోజే 100 గ్రాముల బంగారంకు 1100 రూపాయలు పెరిగింది.

100 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం కు 1100 రూపాయలు పెరగగా, 22 క్యారెట్స్ బంగారంకు 1000 రూపాయలు పెరిగింది. హైదరాబాదులో 10 గ్రాముల (తులం) బంగారం బుధవారం 73,400 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల (తులం) బంగారం 80,070 రూపాయలు ఉంది. హైదరాబాదులో కొనసాగుతున్న బంగారం ధరలే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ఉన్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు