TOP STORIESBreaking Newsజాతీయం
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
మన సాక్షి, బిజినెస్ :
తెలుగు రాష్ట్రాలలో మహిళలకు బంగారం ధర ఆకాశంలో చుక్కలు చూపిస్తోంది. కొంత మేరకు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ శుక్రవారం ఒక్కరోజే భారీగా పెరిగింది. 100 గ్రాముల బంగారంకు 12 వేల రూపాయలు పెరిగింది. తులం బంగారం 90 వేల రూపాయలకు చేరువలో ఉంది.
హైదరాబాదులో 100 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం శుక్రవారం 11 వేల రూపాయలు పెరిగి 8,23,000 గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్స్ బంగారం 12 వేల రూపాయలు పెరిగి 8,97,800 రూపాయలుగా ఉంది.
తులం ఎంతంటే..?
భారీగా పెరుగుతున్న బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన పట్టణాలతో పాటు హైదరాబాదులో తులం బంగారం ఎంత రేటు ఉందంటే..? 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 82,300 రూపాయలు ఉండగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం కు 89,780 రూపాయలు ఉంది.









