Nalgonda : పేదల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.. మంత్రి కోమటిరెడ్డి..!
Nalgonda : పేదల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.. మంత్రి కోమటిరెడ్డి..!
కనగల్, మన సాక్షి :
సన్నబియ్యం పథకం పేదలకు వరమని రోడ్లు – భవనాలు, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా, కనగల్ మండలంలోని జి. యడవల్లి గ్రామంలో ఆయన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మాది ప్రజా ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ప్రజా ప్రభుత్వంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్రంలో 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందించనున్నట్లు తెలిపారు. దశాబ్దకాలంలో గత ప్రభుత్వం ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు రూ. 5 లక్షలతో కట్టించి ఇస్తామన్నారు. కనగల్ మండలంలో రూ.100 కోట్లతో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టామన్నారు.
జి. యడవల్లి గ్రామంలో రూ. 4.63 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాజీవ్ యువవికాసం పథకంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు ఇచ్చి వారికి జీవనోపాధిని కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో పలు ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఒకవైపు అభివృద్ధి మరోవైపు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేస్తున్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయని బిఆర్ఎస్, బిజెపి రెండు ఒకటేనన్నారు. శ్రీశైలం సొరంగం పూర్తి చేయడం తన జీవిత లక్ష్యం అన్నారు. సొరంగం పూర్తయితే గ్రావిటీ ద్వారా రెండు పంటలకు సాగునీరు అంది ఇక్కడి భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. దురదృష్టవశాత్తు టన్నెల్లో బండరాళ్లుకూలి పనులకు అంతరాయం జరగడం ఊహించని పరిణామం అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సన్న బియ్యం పంపిణీ లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతుల సంక్షేమానికి ప్రభుత్వం సన్నరకం దాన్యం పండించే రైతులకు కింటాకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర రూ. 2320కి అదనంగా రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అంతకుముందు జి. యడవల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కనగల్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, డి సి ఓ పత్యానాయక్, పిఆర్ఈఈ గిరిధర్, ఆయా శాఖల మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
MOST READ :
-
Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!
-
దైవదర్శనానికి వెళ్తే.. వివాహితపై సామూహిక అత్యాచారం.. కీలక వ్యక్తులు అరెస్ట్..!
-
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
-
TSPSC : సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసింది.. గ్రూప్ 1,2,3 తో పాటు మరో ఉద్యోగం ఆమె సొంతం..!
-
Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!









