తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపెద్దపల్లి జిల్లా

District collector : గడువులోగా పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : గడువులోగా పనులు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :

పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ పై జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామీణ పంచాయతీ రాజ్ విభాగానికి సంబంధించి పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అన్నారు.

జిల్లాలోని హెల్త్ సెంటర్స్ మరమ్మత్తు పనులు, పాఠశాలల మరమ్మతు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు, రెసిడెన్షియల్ పాఠశాలల ,హస్టల్స్ మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకుంటూ ఏప్రిల్ లోపు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఉపాధి హామీ కింద మంజూరు చేసిన సి సి రోడ్డు నిర్మాణ పనులను మార్చి 15 లోగా పూర్తి చేసి బిల్లులు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఈఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

  2. Rythu : కౌలు రైతుకు భారీ గుడ్ న్యూస్.. ఏడాదికి రూ 20,000..!

  3. Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!

  4. Indiramma Indlu : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారా.. అయితే మంజూరు అయిందో, లేదో.. ఇలా తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు