Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

BREAKING : చెరువు లో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి..!

BREAKING : చెరువు లో అనుమానస్పద స్థితిలో యువకుడు మృతి..!

నేలకొండపల్లి,  మన సాక్షి :

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం చెరువు వద్ద బుధవారం విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన దాసరి శివ (23) చెరువులో మృతదేహం కనిపించింది. కాగా చెరువు లో ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు చెందిన పలువురు చెరువులో చేపల లూఠీకి దిగారు. ఈ క్రమంలోనే చెరువుమాధారం గ్రామానికి చెందిన దాసరి శివ కూడ చేపల కోసం చెరువు కు వెళ్లినట్లు సమాచారం.

చెరువుమాధారం చెరువు పై చేపల వేట సాగించే సమయంలో పెద్ద ఎత్తున చేపల వేట నిర్వహకులు ప్రవేట్ సైన్యం ను దింపినట్లు సమాచారం. వారి వద్ద కర్రలతో పాటు, కారం పోట్లాలు కూడ ఉన్నట్లు తెలుస్తుంది. గ్రామస్తులకు అనుకున్న వరకు చేపలను విక్రయించలేదని అగ్రహం తో లూఠీ కి దిగినట్లు తెలుస్తుంది. అయితే శివ ను ప్రవేట్. సైన్యం దాడి చేసిందా లేక నిజంగా ప్రమాదవశాతు చెరువులో మృతి.
చెందాడా….

ప్రమాదవశాత్తు మృతి చెందితే..శరీరం పై పలు చోట్ల గాయాలు ఎలా అయ్యాయి. అదే జరిగితే అక్కడ పోలీసులు కూడ గస్తీ కాస్తన్నారు కాదా పోలీసులు ఏం చేస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఐదు గంటల పాటు ఉద్రిక్తత : 

చెరువుమాధరం చెరువులో శివ మృతికి గల కారణాలు తెలియాలని, బాధ్యులను అరెస్ట్ చేయాలని, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున చెరువు కట్ట పై చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఇంచార్జీ
రాజిరెడ్డి, నేలకొండపల్లి ఎస్సై ఘటనా స్థలం కు చేరుకుని వివరాలు సేకరించారు. శివ కుటుంబానికి న్యాయం చేయాలని, చేపల వేట సాగించే నిర్వహకులే కారణమని ఆరోపించారు.

ఈ నేపధ్యంలో మంగాపురంతండా-చెరువుమాధారం గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఆరుపులు, కేకలు, తోపులాటల మధ్య చెరువు కట్ట పై ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు ఐదు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. అనంతరం రెండు గ్రామాల మధ్య పెద్దలు చర్చలు జరిపారు. అనంతరం నిండు ప్రాణం కు ఖరీదు చెల్లించారు.

దీంతో వివాదం ప్రశాంతం గా ముగిసింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట నాగరాజు, తెలిపారు. అనంతరం నేలకొండపల్లి ప్రభుత్వ హస్పిటల్ లో, పోస్టుమార్టమ్ నిర్వహించారు.

ALSO READ : Chenchu Lakshmi : కొంపముంచిన యూట్యూబర్ వీడియో.. పోలీసుల అదుపులో చెంచులక్ష్మీ..!

మరిన్ని వార్తలు