District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!
District collector : ఇవీ కేంద్ర ప్రభుత్వ పథకాలు.. దరఖాస్తు ఇలా.. సద్వినియోగం చేసుకోవాలి.. జిల్లా కలెక్టర్..!
పెద్దపల్లి, ధర్మారం, మన సాక్షి :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి కల్పన, బీమా పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో కోరారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పి.ఎం.ఈ.జి.పి), పేదలకు జీవిత బీమా కల్పించేందుకు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన (పి.ఎం.జే.జే.బీ.వై), ప్రమాద బీమా కల్పించేందుకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పి.ఎం.ఎస్.బీ.వై) పథకాలను అమలు చేస్తుందని అన్నారు.
పి.ఎం.ఈ.జి.పి పథకం దరఖాస్తు చేసుకోవాలంటే 18 సంవత్సరాలు వయస్సు,8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, ఈ పథకం కింద తయారీ రంగం యూనిట్ స్థాపనకు 50 లక్షల, సేవారంగం యూనిట్స్ స్థాపనకు 20 లక్షల రూపాయలకు మించకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు నూతన రుణాలు సబ్సిడీలు అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు విస్తరణకు కూడా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చని, ఆన్ లైన్ kviconline.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
18 నుంచి 50 సంవత్సరాలు గల వారు తప్పనిసరిగా పి.ఎం.జే.జే.బీ.వై జీవిత బీమా కలిగి ఉండాలని, బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని, 55 సంవత్సరాల వరకు ఈ పాలసీని డేటా పునరుద్ధరించుకోవచ్చని తెలిపారు. పి.ఎం.జే.జే.బీ.వై క్రింద ఏటా 436 రూపాయల ప్రీమియం చెల్లిస్తే ఏ కారణం చేత మరణించినా 2 లక్షల రూపాయల బీమా అమలు అవుతుందని అన్నారు.
18 నుంచి 70 సంవత్సరాలు గల వారు తప్పనిసరిగా పి.ఎం.ఎస్.బీ.వై ప్రమాద బీమా కలిగి ఉండాలని, బ్యాంకు ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకంలో నమోదు చేసుకోవచ్చని, పి.ఎం.ఎస్.బీ.వై క్రింద ఏటా 20 రూపాయల బీమా చెల్లిస్తే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యానికి లక్ష రూపాయల బీమా అమలు అవుతుందని అన్నారు.
ప్రజల ప్రయోజనార్థం అమలు చేస్తున్న పి.ఎం.ఈ.జి.పి, పి.ఎం.ఎస్.బీ.వై, పి.ఎం.జే.జే.బీ.వై వంటి పథకాలను ప్రజలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
MOST READ :
-
Ration Cards : రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా.. వచ్చిందా..? రాలేదా.? తెలుసుకోవడం చాలా సింపుల్.. ఇలా చేయండి..!
-
Miryalaguda : మల్టీపర్పస్ సిబ్బందికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ భరోసా..!
-
Uttam Kumar Reddy : కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం..!
-
UPSC : పట్టు వదలని విక్రమార్కుడు.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫలితాల్లో మిర్యాలగూడ వాసి టాప్ ర్యాంకర్..!









