Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!

వీళ్లు మామూలు ముదుర్లు కాదు.. పని చేసే సంస్థకే కన్నం..!

తూప్రాన్, మనసాక్షి :

జల్సాలకు అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చడానికి మార్గం లేక పనిచేస్తున్న సంస్థ లో భద్రత సిబ్బంది కళ్ళు గప్పి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను మనోహరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. ఎస్ఐ శుభాష్ గౌడ్ తెలిపిన వివరాలు ప్రకారం..

మనోహరాబాద్ మండల కేంద్రం లో గల ఐటీసీ గోదాం లో ట్రాన్స్ పోర్టు లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న మేదరబోయిన శ్రీకాంత్, శెట్టి మహేష్ లు వ్యసనాలకు అలవాటు పడి అప్పులు చేసి వాటిని తీర్చడానికి దొంగతనం చేయాలని ప్లాన్ చేసి ఐటీసీ గోదాం నుండి వివిధ ప్రాంతాలకు రవాణా అయ్యే వాహనాలనుండి భద్రత సిబ్బంది కళ్ళు గప్పి సిగరెట్ డబ్బాలను దొంగలించి విక్రయించి సొమ్ము చేసుకునే వారు.

గత నెల లో 10లక్షల విలువ గల సిగరెట్ బాక్స్ లను దొంగలించి విక్రయానికి తరలిస్తున్న క్రమంలో మనోహరాబాద్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో ఇద్దరు నిందితులు పట్టుబడగా వారిని విచారించగ ఐటీసీ గోదాం కు చెందిన సిగరెట్ బాక్స్ లు దొంగలించినట్లు ఒప్పుకున్నారు. అదే విధంగా గతం లో సైతం ఇలాంటి సిగరెట్ బాక్స్ చోరీ చేసి విక్రహించినట్లు ఒప్పుకున్నారు.

వారినుండి 8 లక్షల నగదు, 10 లక్షల విలువ గల సిగరెట్ బాక్స్ లను, మూడు రవాణా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరు ఇప్పటి వరకు 33 లక్షల విలువ గల సిగరెట్ లను చోరీ చేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను ఎస్పి సమక్షంలో మీడియా ముందు ప్రవేశ పెట్టి రిమాండ్ కు తరలించిట్లు ఎస్ఐ తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్పీ శ్రీనివాస్ రావు ఎస్ఐ సిబ్బంది ని అభినందించారు. ఈ సమావేశం లో అదనపు ఎస్పీ మహేందర్, డిఎస్పి నరేందర్ గౌడ్, సిఐ రంగా కృష్ణ, ఎస్ఐ శుభాష్ గౌడ్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : బిసి రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కు నిరసన.. బీసీ సంఘాల రాస్తారోకో..!

  2. Nizamabad : ఆర్టీసీ బస్సుపై దాడి చేసిన యువకుడు..!

  3. TG News : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. హైకోర్టు సంచలన నిర్ణయం..!

  4. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసిల్దార్..!

మరిన్ని వార్తలు