Breaking Newsజిల్లా వార్తలురాజకీయంసంగారెడ్డి జిల్లా

పర్యాటక ప్రాంతంగా తీగలనాగరం చెరువు..!

పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

పర్యాటక ప్రాంతంగా తీగలనాగరం చెరువు..!

పటాన్చెరు, మనసాక్షి :

పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ డివిజన్ పటేల్ గూడ పరిధిలోని తీగలనాగరం చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

చెరువు పరిధిలో ఒక కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫెన్సింగ్ నిర్మాణ పనులకు బుధవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ గూడ పరిధిలోని వివిధ కాలనీల ప్రజల సౌకర్యార్థం చెరువు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే బండ్ పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు.

చెరువు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు పూర్తిస్థాయిలో ఫెన్సింగ్ వేయనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని చెరువుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, హెచ్ఎండబ్ల్యూఎస్ ఇరిగేషన్ ఈఈ మల్లేష్, డిఈ రాజశేఖర్, ఏఈ గులాం, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు