క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. బైక్ కనిపిస్తే ఖతమే..!

Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. బైక్ కనిపిస్తే ఖతమే..!

నల్లగొండ, మన సాక్షి:
గత కొన్ని రోజులుగా వరుసగా తెలంగాణ లోని దామరచర్ల, నల్గొండ పట్టణం, నార్కట్పల్లి, ఇబ్రహీంపట్నం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని మార్టూర్, పొన్నూరు పట్టణాలలో రాత్రి సమయంలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్ల దొంగతలనాలకు పాల్పడుతున్న ముఠా ను అరెస్టు చేసినట్లు నల్లగొండ ఎస్పీశరత్చంద్ర పవార్ తెలిపారు.  ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నేరస్తుల నుండి 14  మోటార్ సైకిల్ లు , 06 – రాయల్ ఎన్ఫీల్డ్, 07 –  పల్సర్ బైకులు, 01 – షైన్ మోటర్ బైక్  మొత్తం విలువ రూ. 26,50,000/- స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై మొత్తం 13 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయినట్లు తెలిపారు.
వాడపల్లి  పోలీస్ స్టేషన్ లో – 03  కేసులు, నల్గొండ -I  టౌన్ పోలీస్ స్టేషన్ లో- 02 కేసులు , నల్గొండ -II  టౌన్ పోలీస్ స్టేషన్ లో- 01 కేసు నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ లో- 01 కేసు , నార్కట్పల్లి  పోలీస్ స్టేషన్ లో – 02 కేసులు, ఇబ్రహీంపట్టణం  పోలీస్ స్టేషన్ లో – 1 కేసు, మార్టూర్ పోలీస్ స్టేషన్ లో  -02 కేసులు, పొన్నూరు పట్టణ   పోలీస్ స్టేషన్ లో – 1 కేసు నమోదు కావడంజరిగినది. రాజమండ్రి పట్టణంలో – 01 కేసు నమోదు చేయవలసి ఉన్నది.
నలమాలయెర్రబ్బాయి లూథర్,  గుంజి అంకమ రావు, మట్టిపల్లి శ్రీకాంత్ 30 తెల్లవారు జాము  సమయమున వాడపల్లి ఎస్ ఐ  తన సిబ్బంధి తో కలసి వాడపల్లి గ్రామ శివారులోని తెలంగాణ- ఆంద్రప్రదేశ్ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేయుచుండగా అదే సమయంలో మొదటి ఇద్దరు నేరస్థులు గతంలో మాదిరిగానే దొంగిలించిన మోటార్ సైకిల్ ను అమ్మడానికి గుంటూరు వైపునకు వెల్లుతుండగా అదే సమయంలో  వారి పై అనుమానం కలిగి పట్టుబడి చేసి అనంతరం వారి ముగ్గురి వద్ద నుండి కలిపి 14మోటార్ సైకిల్  లను స్వాధీన పరుచుకోవడం జరిగినది.
ఇట్టి ముగ్గురు నేరస్తులు గతంలో నల్గొండ జిల్లాలో (66) మోటార్ సైకిల్ లను ఛేదించిన కేసులలో కూడా నేరస్తులుగా ఉన్నారు. ఇట్టి ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం (14) మోటార్ సైకిల్ లతో పాటు మరొక (22) మోటార్ సైకిల్ లను కూడా దొంగిలించినట్లుగా తమ నేరాన్ని ఒప్పుకున్నారు. అనంతరం పోలీస్ కస్టడీ లో భాగంగా మిగిలిన 22మోటార్ సైకిల్ లను ఛేదించడం జరుగుతున్నది.
ఇట్టి కేసులను చేధించి ప్రజలకు పోలీస్ ల పై మరింత నమ్మకం కలిగేలాచేసిన సిఐ మిర్యాలగూడ రూరల్ పి న్  డ్ ప్రసాద్ గారిని,సి సి స్ ఇన్స్పెక్టర్ డానియెల్ గారిని,వాడపల్లి  ఏస్ ఐ శ్రీకాంత్ రెడ్డి ,  సిబ్బంది సతీశ్, భాస్కర్, వెంకటేశ్వర్లు, రషీధ్ లని, నల్లగొండ సి స్ స్  సిబ్బంధి   హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్దన గిరి, రాంప్రసాద్, పుష్పగిరి, శ్రీనివాస్ రెడ్డి లను జిల్లా  ఏస్ పిఅభినందించి రివార్డ్ ప్రకటించడం జరిగింది.

MOST READ :

మరిన్ని వార్తలు