క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఈ ముఠాలో మామూలోల్లు కాదు.. ఆరుగురు అరెస్ట్..!

Suryapet : ఈ ముఠాలో మామూలోల్లు కాదు.. ఆరుగురు అరెస్ట్..!

సూర్యాపేట, మనసాక్షి:

అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

సూర్యాపేట పట్టణానికి చెందిన ఆరుగురు వ్యక్తులు గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నల్లచెరువు గుట్ట వద్ద గంజాయితో పట్టుబడినట్లు తెలిపారు. వీరి వద్దనుండి సుమారు మూడు లక్షల రూపాయల విలువ గల సుమారు 12 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్ లు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇట్టి కేసులో అదుపులోకి తీసుకున్న 6 గురు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : విద్యార్థుల పట్ల వివక్ష.. ఆల్ఫా స్కూల్ ముందు భారీ ధర్నా..!

  2. Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!

  3. Penpahad : జిల్లా వైద్యాధికారి కీలక ఆదేశాలు.. పిహెచ్సి ఆకస్మిక తనిఖీ..!

  4. Miryalaguda : సిపిఆర్ తో రైతును కాపాడిన 108 సిబ్బంది..!

మరిన్ని వార్తలు