Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువైద్యం

Penpahad : జిల్లా వైద్యాధికారి కీలక ఆదేశాలు.. పిహెచ్సి ఆకస్మిక తనిఖీ..!

Penpahad : జిల్లా వైద్యాధికారి కీలక ఆదేశాలు.. పిహెచ్సి ఆకస్మిక తనిఖీ..!

పెన్ పహాడ్ , మన సాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ( డి ఎం హెచ్ ఓ) సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పి చంద్రశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించినారు.

వివరాలలోకి వెళితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గల చిన్న చిన్న పిచ్చి మొక్కలతో ఉండటం చూసి పూర్తిస్థాయిలో గ్రౌండ్ ను శుభ్రం చేయించాలని ఆదేశించారు. చిన్నపిల్లల వ్యాధి నిరోధక వ్యాక్సిన్ నిల్వ ఉంచే గదిని పరిశీలించి, గతంలో చిన్నపిల్లలకు పెద్దలకు వ్యాక్సిన్ వ్యాక్సిన్ వాడిన విధానాన్ని రికార్డులను పరిశీలించినారు.

హాస్పిటల్ సిబ్బంది హాజరు పట్టికను క్షుణంగా పరిశీలించినారు. ప్రతి నెల ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలతో జరుగుతున్న రివ్యూ మీటింగును ముందు ప్రణాళిక తయారు చేసుకుని రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని ముందుగా ఆశా వర్కర్లకు రివ్యూ మీటింగ్ విషయాలు తెలవకుండా ఎలా సమాధానం ఇస్తారని ఆయన హాస్పిటల్ సూపర్వైజర్లను ప్రశ్నించారు.

ప్రతి నెల రివ్యూ మీటింగ్ వివరాలను ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. గ్రామాలలో ఆశా వర్కర్లు ఓ ఆర్ ఎస్ పాకెట్లు ఏ టార్గెట్ ప్రకారం వాడుతున్నారని ఏ గ్రామంలో ఎంత వాడినారని వివరణ అడిగి తెలుసుకున్నారు .

సూపర్వైజర్లు గ్రామాలకు వెళ్లినప్పుడు ఆశా వర్కర్లు ఏఎన్ఎంల ను వివరణ తీసుకోవాలని ఆయన తెలిపినారు. గతము లో మండల వైద్యాధికారి మధ్య ఏ ఎన్ ఎముల ఫిర్యాదుల పై సూర్యాపేట డిప్యూటీ డిఎంహెచ్వో జరిపిన ఎంక్వైరీ పై వివరణ కోరగా పూర్తి నివేదిక సూర్యాపేట జిల్లా తేజస్సునందులాల్ పవర్ కు అందజేయడం జరిగిందని తెలిపినారు.

ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి స్రవంతి, పారాసిస్ట్ అనిల్, సూపర్వైజర్ సైదయ్య, జానకమ్మ, సుజాత లు, హెచ్ ఈ ఓ లు చంద్రశేఖర్ రాజు, శ్రీనివాసులు, వెంకటరమణ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. New Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Bajaj Allianz : బజాజ్ అలియాంజ్ లైఫ్ కొత్త ఫండ్‌ ఆవిష్కరణ..!

  3. Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!

  4. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

  5. Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు