Nalgonda : స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత.. పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
Nalgonda : స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత.. పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!
నల్లగొండ, మనసాక్షి :
వరంగల్, ఖమ్మం, నల్లగొండ శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు.
ఆర్జాలబాయి పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన వెర్ హౌస్ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్స్ దగ్గర దాదాపు 100 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర 144 సెక్షన్‌తో పాటు మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నాం అని అన్నారు.
స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, టి.యస్.యస్.పి సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ ల వద్ద 24 గంటలూ సాయుధ రక్షణలో ఉంటూ, సీసీటీవీకెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించబడుతుంది అన్నారు.
వీరందరూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు విధులు నిర్వహించనున్నారని, స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించనున్నారని తెలిపారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, డి.ఎస్.పి శివరాం రెడ్డి తదితరులున్నారు.
MOST READ :
- MLC POLING : ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. 93.55 శాతం పోలింగ్..!
- Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!
- Gold Price : వరుసగా రెండో రోజు కుప్పకూలిన బంగారం ధర..!
- Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
- Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!









