Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణరాజకీయం

THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!

THUMMALA : తగ్గేదే లే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతా.. తుమ్మల స్పష్టం..!

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నెలకొండపల్లి , మన సాక్షి:

నెలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పలు గ్రామాల ముఖ్య నాయకులు. సర్పంచులు. ఎంపీటీసీలు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని నేలకొండపల్లి మండలం ముఖ్య నాయకులు కలిసి పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి పాలేరు అభివృద్ధిలో పాటుపడాలని.

 

పలువురు నాయకులు మాజీ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఉభయ జిల్లాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు నాయకులు తరలివచ్చారు. ఖమ్మంలో తన నివాసం వద్ద తుమ్మల ప్రసంగించారు. తనను అభిమానించే ప్రజల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతానని. ఈ విషయంలో తగ్గేదే లేదని ప్రకటించారు.

 

ALSO READ : 

  1. రాబోయే ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ కు అధికారం..!
  2. Suryapet : మంత్రి తో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ పై విచారణ జరపాలి
  3. Telangana : కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వద్దు.. అభ్యర్థుల ఎంపికపై కోదండ రెడ్డి కీలక సూచనలు..!
  4. Chandrayaan3 : జాబిల్లిపై రోవర్ లేటెస్ట్ వీడియో ..ఏం చేసిందో మీరే చూడండి. ! ( వీడియో)
  5. Phone Pe Share Market | ఫోన్ పే షేర్ మార్కెట్.. వినియోగదారులకు గుడ్ న్యూస్..!

 

నాగలి దున్నుతున్న తనను రాష్ట్ర మంత్రిని చేసిన ప్రజలకు తీర్చుకోలేనని అన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో జిల్లాల్లో ఎవరు చేయని విధంగా అభివృద్ధి పరుగులు పెట్టించానని తెలిపారు. రాజకీయంగా తనకు ఎప్పుడు కష్టం వచ్చినా ప్రజలు కార్యకర్తలు బతికించుకున్నారని.

 

వచ్చే ఎన్నికల్లో ఆ బాధ్యత మరోసారి ప్రజలే తీసుకోవాలని కోరారు. ప్రజా బలమే తన బలమని. అన్నారు. గోదావరి జలలు పారించడమే నా చివరి కోరికను భావోద్వేగంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు