తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : టీజేఎఫ్ రజతోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ.. టియుడబ్ల్యూజే (హెచ్ 143) నూతన కమిటీల ఎన్నిక..! 

Miryalaguda : టీజేఎఫ్ రజతోత్సవ సభల పోస్టర్ ఆవిష్కరణ.. టియుడబ్ల్యూజే (హెచ్ 143) నూతన కమిటీల ఎన్నిక..! 

టీయూడబ్ల్యూజే (హెచ్-143) గుండగోని జయశంకర్ గౌడ్

మిర్యాలగూడ, మన సాక్షి:

ఈనెల 31న హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించనున్న టీజేఎఫ్ రజతోత్సవ సభలను విజయవంతం చేద్దామని టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ గౌడ్ అన్నారు. సోమవారం మిర్యాలగూడ పట్టణంలోని ఎంపిడివో కార్యాలయ సమావేశ మందిరంలో యూనియన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ సంస్థగా టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు.

టీయూడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్నెబోయిన మట్టయ్య మాట్లాడుతూ జల విహార్ లో నిర్వహించనున్న జర్నలిస్టుల జాతరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి రజతోత్సవ సభలను విజయవంతం చేయాలని కోరారు.
అనంతరం టీజేఎఫ్ రజతోత్సవ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు.

సమావేశం లో టీయూడబ్ల్యూజే (హెచ్-143) మిర్యాలగూడ నియోజకవర్గ కమిటీ, మిర్యాలగూడ పట్టణం, మండల కమిటీ నూతన కార్యవర్గాలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా ప్రధాన కార్యదర్శి శేషరాజుపల్లి వీరస్వామి, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి మల్లె నాగిరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దండ భాస్కర్, జిల్లా కార్యవర్గ సభ్యులు విరగని లక్ష్మీనారాయణ, బొంగరాల మట్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జంగా లక్ష్మణ్, కోయ సునీల్

మిర్యాలగూడ నియోజకవర్గ నూతన కార్యవర్గం :

గౌరవ అధ్యక్షులుగా వల్లాల వేణు (ఈటీవీ భారత్),
అధ్యక్షులుగా జంగా లక్ష్మణ్ యాదవ్ (వార్త), ఉపాధ్యక్షులుగా దైద రవిందర్ (సూర్య దిశ), కుంచం వెంకట్ (టి న్యూస్), ఎం. రామానుజాచారి (నమస్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా కోయ సునీల్ (ఆర్ టి వి), సహాయ కార్యదర్శులుగా మంద లక్ష్మణ్,
కాట్రాజ్ అశోక్ (స్వతంత్ర టీవీ), దైద వెంకటేశ్వర్లు (ప్రజాలహరి), బొంగర్ల సైదులు (మన సాక్షి), కోశాధికారిగా ఎం. రామకృష్ణ (వి6 ), కార్యవర్గ సభ్యులుగా కొలిపాక నాగేందర్ (దిశ), పుట్టల నగేష్, జెర్రిపోతుల ప్రసాద్, కందుకూరి సుదర్శన్, చిట్యాల సురేందర్, ములుకూరి వినయ్, దైద నాగరాజు (గని), శీలం వినయ్ (మన సాక్షి), లీగల్ అడ్వైజర్లుగా బి. వేణుగోపాల్ రావు (ఈనాడు-లీగల్), జె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి-లీగల్), తదితరులు ఎన్నికయ్యారు.

మిర్యాలగూడ టౌన్, మండల కమిటీ :

గౌరవ అధ్యక్షులుగా ఎం ఎన్ రెడ్డి (సీనియర్ జర్నలిస్టు), అధ్యక్షునిగా ధనావత్ రమేష్ నాయక్ (స్టూడియో ఎన్), ఉపాధ్యక్షులుగా కందుకూరి సుదర్శన్, రోషన్ (ఆర్గాన్ న్యూస్), ప్రధాన కార్యదర్శిగా నడ్డి. శివకృష్ణ (వి3 న్యూస్), సహాయ కార్యదర్శులుగా పరకాల సురేష్, ఇండ్ల గణేష్ (లోకల్ కేబుల్), కోశాధికారిగా కడియం కరుణాకర్, కార్యవర్గ సభ్యులుగా తిరందాసు విష్ణు, పగడాల నగేష్ తదితరులు ఎన్నికయ్యారు.

ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువాలతో సత్కరించిన పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.

MOST READ : 

  1. Gold Price : దిగివచ్చిన బంగారం.. ఈరోజు తులం ధర ఎంతంటే..!

  2. TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

  3. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

  4. Hair : జుట్టు రాలుతుందా.. తెల్లబడుతుందా.. అయితే ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు..!

మరిన్ని వార్తలు