తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

TPCC : మంత్రి పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!

TPCC : మంత్రి పొంగులేటి పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్..!

మనసాక్షి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఆదివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రకటన పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను క్యాబినెట్ సమావేశానికి ముందుగానే ఆయన మీడియాతో ఎలా మాట్లాడుతారని వండిపడ్డారు. ఒకరి మంత్రిత్వ శాఖ గురించి మరొకరు మాట్లాడవేంటని ఆయన ప్రశ్నించారు. అధిష్టానంతో సంప్రదించకుండా ప్రకటనలు చేయొద్దని మహేష్ గౌడ్ సూచించారు.

పొంగులేటి ఏమన్నారంటే..?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా ఎంపిటిసి ,జడ్పిటిసి ఎన్నికలు అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. అయితే పొంగులేటి ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రశ్నించడం రాజకీయంగా చర్చానీయాంశంగా మారింది.

MOST READ : 

మరిన్ని వార్తలు