క్రైంBreaking Newsజిల్లా వార్తలుమెదక్

రాఖీ పండగ నింపిన విషాదం.. జోగిపేటలో డివైడర్ స్థంబాన్ని డికొట్టిన కారు..!

రాఖీ పండగ నింపిన విషాదం.. జోగిపేటలో డివైడర్ స్థంబాన్ని డికొట్టిన కారు..!

అందోలు, మనసాక్షి :

రాఖీ పండగ పర్వదినం రోజు అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తాయి. అన్నలకు, తమ్ముళ్లకు చెల్లెళ్లు, అక్కలు రాఖీలు కట్టి పండగను ఘనంగా జరుపుకొంటారు. కానీ రక్షాబంధన్‌ రోజున ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

నాగోల్ కు చెందిన అభిలాష్ (30) జోగిపేటలోని తన అత్తగారింటికి భార్య సింధూ, కుమారుడితో కలిసి రాఖీ కట్టేందుకు కారులో బయలుదేరి వస్తున్న క్రమంలో జోగిపేట కు చేరుకోగానే బస్టాండ్ ముందున్న డివైడర్ బట్టర్ ఫ్లై స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది.

దీంతో కారులో ఉన్న యువకుడు తీవ్ర గాయలవగా వెంటనే ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. కారు బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్న అభిలాష్, ఆయన భార్య సింధు, క్షేమంగా బయటకు రావడంతో ప్రమాదం తప్పిందని అందరూ భావించారు.

స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అభిలాష్ కు ప్రథమ చికిత్స చేసి, హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. రెండు, మూడు నిమిషాల వ్యవధిలో క్షేమంగా అత్తగారింటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరం.

మృతి విషయాన్ని తెలుసుకున్న అత్తవారింటి బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. అభిలాష్ మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్బంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ : 

District collector : సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. రైతులను ఇబ్బందులు పెట్టిన తహసిల్దార్ బదిలీ, ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల సస్పెండ్..!

యువకుడి సెల్ఫీ వీడియో.. ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..!

హైదరాబాద్ నగరంలో కుండపోత.. జలమయమైన రోడ్లు, కాలనీలు..!

Cm Revanth Reddy : బాహుబలి.. ప్రభాస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

మరిన్ని వార్తలు